నాకు ఓ సంబంధం వచ్చింది... ఆ అబ్బాయితో వివాహం కుదురుతుందా..?
అనూరాధ-నెల్లూరు: మీరు త్రయోదశి గురువారం ధనుర్‌లగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, కేతువులు ఉండటం వల్ల భర్త స్థానము నందు రాహువు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి.
లాభాధిపతి అయిన శుక్రుడు ధన, కుటుంబస్థానము నందు ఉండటం వల్ల, వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు. తక్షక కాలసర్పదోషం ఉన్నందువల్ల తక్షక కాలసర్పదోష శాంతి చేయించండి.
మీ ఇద్దరి జాతక పొంతన: అబ్బాయిది మకరలగ్నము, రేవతి నక్షత్రము, మీనరాశి నందు జన్మించారు. మీ ఇద్దరి జాతక పొంతన 27 పాయింట్లు కుదిరాయి. మీకు దగ్గరగా ఉన్న సిద్ధాంతిచే జాతక పరిశీలన చేయించండి.