మీరు ఏకాదశి గురువారం, తులాలగ్నము, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, కేతువులు ఉండటం వల్ల, భార్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. మీకు 27 లేక 28 సం||ము నందు వివాహం అవుతుంది.
2011 డిసెంబరు వరకు అష్టమశనిదోషం ఉన్నందువల్ల తల పెట్టిన పనిలో చికాకులు, అవరోధాలు ఎదుర్కొంటున్నారు. 2007 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. 2012 లేక 2013 నందు మీరు స్థిరపడతారు. ఈ శని మీకు 2013 నుంచి 2026 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ప్రతీ సంవత్సరం శివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించండి.