మీరు దశమి శుక్రవారం, కన్యాలగ్నము, మృగశిర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్ర, కేతువులు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి.
లగ్నము నందు కేతువు ఉండి, భర్తస్థానము నందు రాహువు ఉండటం వల్ల, భర్తస్థానాధిపతి అయిన గురువు షష్ఠమము నందు ఉండటం వల్ల, ఒక్కొసారి ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు.
మీకు 26 లేక 27 సం||ము నందు వివాహం అవుతుంది. 2007 నుంచి గురు మహర్థశ ప్రారంభమయింది. ఈ గురువు 2012 నుంచి 2023 వరకు మంచి అభివృద్ధిని ఇస్తుంది. విష్ణుసహస్రనామ పారయణం వినడం వల్ల లేక చదవడం వల్ల శుభం కలుగుతుంది.