Weekly Horoscope for All Zodiac Signs గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబీకులు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గృహమరమ్మతులు చేపడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. అధికారులకు బాధ్యతల నుంచి విముక్తి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వస్త్ర, పచారీ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పనివారలతో జాగ్రత్త. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. పాత పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడుతారు. కన్సల్టెన్సీలు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. పరిస్థితులు త్వరలో సర్దుకుంటాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాలు కలిసిరావు. కీలక పత్రాలు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. బుధవారం నాడు ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ ఇబ్బందులను సన్నిహితులకు తెలియజేయండి. సంతానానికి శుభయోగం. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వస్త్ర, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పత్రాల రెన్యువల్‌ను నిర్లక్ష్యం చేయకండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతులు మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ చొరవతో సమస్య పరిష్కారమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సంతానానికి ఉద్యోగయోగం. ఉద్యోగసులు ఏకాగ్రతతో పనిచేయాలి. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తగిన సమయం. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పు, చిత్తశుద్ధితో యత్నాలు సాగించండి. నిస్తేజానికి లోనుకావద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకులోను కావద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ధనసమస్యలు ఎదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. గత అనుభవాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారుల తీరును గమనించి మెలగండి. కీలక పత్రాలు అందుకుంటారు.
ప్రణాళికలు వేసుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. మీ అభిమానానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఉల్లాసంగా గడపుతారు. సంస్థల స్థాపనలు, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగాల్లో అనుకూల మార్పులుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహంలో ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. వైద్యపరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆహార నియమాలు పాటించండి. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. గురువారం నాడు ఫోన్ సందేశాలు నమ్మవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు మరింత సన్నిహితులవుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికవిషయాల్లో మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మాటతీరుతో నెట్టుకొస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సలహాలు, సాయం అందిస్తారు. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వస్త్రవ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగస్తుల బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు మనసాపం కలిగిస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాల్లో ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. అయిన వారే సహాయం అందించేందుకు వెనుకాడుతారు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో అలక్ష్యం తగదు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. వాహనదారులకు దూకుడు తగదు.
ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని విధాలా అనుకూలం. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. గురువారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింతపు లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.