జాతకం

మేషం
మేష రాశి : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయం 8, వ్యయం : 14, రాజపూజ్యం : 4, అవమానం: 3 ఈ రాశివారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది. శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనం అమర్చుకుంటారు. గృహంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. చిత్తశుద్ధితో శ్రమించిన గాని ఆశించిన ఫలితాలు పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపం, అకారణ కలహాలు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరుచు విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఉద్యోగస్తులు పనియందు ధ్యాస వహించాలి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురికావద్దు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటె రబీ ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ సందర్శనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. ఈ రాశివారికి అభయాంజనేయస్వామి ఆరాధన అన్ని విధాలా శుభదాయకం.

జనవరి-2024

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వేడుకలను ఘనంగా చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన....more

ఫిబ్రవరి-2024

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం ప్రథమార్ధం అనుకూలదాయకమే. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దూరపు బంధుత్వాలు....more

మార్చి-2024

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య తరుచు కలహాలు.....more

ఏప్రియల్-2024

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అనుకూలతలు అంతగా ఉండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆదాయం నిరాశాజనకం. ఊహించని ఖర్చులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. దంపతుల మధ్య తరచు కలహాలు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ....more

మే-2024

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మనోబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. గృహంలో స్తబ్ధత....more