లవంగాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు వేయించి పొడిచేసుకుని తేనెలో కలుపుకుని తీసుకుంటే గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించుటలో లవంగాలు దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి.
దంత సంబంధమైన వ్యాధులను తొలగిస్తాయి. పంటి నొప్పితో బాధపడేవారు లవంగాలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అటువంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. నోటి దుర్వాసనను తగ్గించుటకు చక్కగా పనిచేస్తాయి. లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, పెయిన్ కిల్లింగ్ వంటి గుణాలు అధికంగా ఉన్నాయి.