పసుపుతో మధుమేహ వ్యాధిని అడ్డుకోవచ్చు...

బుధవారం, 29 ఆగస్టు 2018 (10:13 IST)
పసుపులో గల ఔషధ గుణాలను తెలుసుకుందాం. పసుపును తరచుగా ఆహారంలో తీసుకోవడం వలన రక్తాన్ని శుభ్రపరచుటలో ఎంతో సహాయపడుతుంది. అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించే గుణాలు పసుపులో పుష్కలంగా ఉన్నాయి. రక్తప్రసరణలో అడ్డంకులను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడంలో ఎంతగానో దోహదపడుతుంది.
 
 
తలలో వచ్చే కురుపులను, గాయాలను మాన్పుతుంది. ప్రతిరోజూ పాలలో కొద్దిగా పసుపుని కలుపుకుని తీసుకుంటే కఫాన్ని అరికట్టుటకు సహాయపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుటలో పసుపు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్రమంతప్పకుండా ప్రతిరోజూ వ్యాయామంతో పాటు పసుపు వంటి సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం వలన వివిధ రకాల వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు