గుడ్డు సొనలో అరటిపండు గుజ్జు కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:23 IST)
జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు తెల్లసొనలో కలబంద గుజ్జును కలుపుకుని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు రాలే సమస్యలు తొలగిపోతాయి.
 
రాత్రివేళ మెంతులను నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని బాగా శుభ్రం చేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో గోరింటాకు పొడి, గుడ్డు తెల్లసొన వేసి కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. రెండు గంటల తరువాత నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా ఆలివ్ నూనె, అరటిపండు గుజ్జు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు పొడిబారకుండా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు