చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో రోజ్ వాటర్ తరువాతే ఏదైనా అంటారు చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నార. ఖరీదైనా లోషన్స్ కన్నా రోజ్ వాటర్ ఎంతో బెటర్ అంటున్నారు. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటమే.
ముఖ్యంగా రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందో అలాగే కళ్ళకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. రోజ్ వాటర్ లోని యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కాలుష్యం, ధూళి వల్ల కలిగే బాధను తగ్గిస్తాయట.
ఎక్కువ పనిగంటలు, ఒత్తిడి, కాలుష్యం, కంప్యూటర్లు నిరంతరం చూస్తూ ఉండటం వల్ల కళ్ళు త్వరగా అలసిపోతాయి. అలాంటివారు రోజ్ వాటర్‌ని వాడటం మంచిదట. దీని కోసం చేయాల్సిందల్లా కొద్దిగా నీళ్ళు తీసుకుని దానిలో కొన్ని చుక్కల చల్లటి రోజ్ వాటర్ కలపాలి. అలా చేసి కళ్ళు మూసుకుని వాటర్‌తో కళ్లు శుభ్రం చేసుకుంటే ఎంతో మంచిదట.