ఈ సంవత్సరం, ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం, "చర్మ ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం లేదు" అనే నేపథ్యంతో నిర్వహించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంలో చర్మం యొక్క ప్రాధాన్యతను ఇది నొక్కి చెబుతుంది. ఇప్పుడు బాహ్య చర్మ సంరక్షణ చర్యలకు మించి చర్మ ఆరోగ్యం ఉంది- ఇది లోపలి నుండి, మన రోజువారీ ఆహార ఎంపికలతో ప్రారంభమవుతుంది. చర్మానికి అనుకూలమైన ఆహారాలతో సహా విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉన్న కాలిఫోర్నియా బాదం వంటి ఆహారాలు చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతో పాటుగా మీరు ఉత్తమంగా కనిపించడానికి, అనుభూతి చెందడానికి సహాయపడతాయి.
కాలిఫోర్నియా బాదం 15 ముఖ్యమైన పోషకాల యొక్క శక్తి కేంద్రం, వీటిలో చాలావరకు చర్మ కాంతి, రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి. విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ-ఏజింగ్ లక్షణాలను అందిస్తాయి. చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. నిజానికి క్రమం తప్పకుండా బాదం తీసుకోవడం ద్వారా ముఖంలో పడే ముడతలను అడ్డుకోవచ్చని, వాటిని మీ రోజువారీ అందానికి ప్రభావవంతమైన జోడింపుగా మారుస్తుందని పరిశోధన వెల్లడిస్తుంది.
ఆధునిక పోషకాహార శాస్త్రంతో పాటు, ఆయుర్వేదం, సిద్ధ , యునాని వంటి సాంప్రదాయ పద్ధతులు బాదంను వాటి చర్మ ప్రయోజనాల కోసం చాలా కాలంగా గుర్తించాయి. ఈ పురాతన పద్ధతులు మెరుస్తున్న చర్మానికి బాదం ఎలా మద్దతు ఇస్తుందో వెల్లడించాయి. అంతేకాకుండా, బాదం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యువిబి కిరణాల నుండి రక్షణ లభిస్తుంది, ఇది తీవ్రమైన భారతీయ వేసవిలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బాదం పప్పును నిజమైన సూపర్‌ఫుడ్‌గా మార్చేది వాటి వైవిధ్యత, సౌలభ్యం. వాటిని సాధారణముగా తినవచ్చు, నానబెట్టి తినవచ్చు, వేయించుకుని లేదా స్మూతీలు, సలాడ్‌లు, డెజర్ట్‌లు, సాంప్రదాయ వంటకాలకు జోడించడం ద్వారా ఆరగించవచ్చు. మీరు వాటిని ఎలా ఆస్వాదించినా, బాదం పప్పులు వాటి శక్తివంతమైన, గొప్ప పోషక ప్రొఫైల్‌ను నిలుపుకుంటాయి. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం సులభం.
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం, చర్మ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి చర్మ సంరక్షణ నిపుణురాలు, కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతిక మిట్టల్ గుప్తా మాట్లాడుతూ, "నిజమైన చర్మ ఆరోగ్యం మనలోనే దాగి ఉందని నేను ఎల్లప్పుడూ నా క్లయింట్‌లకు గుర్తు చేస్తుంటాను. తగినంత నిద్ర, చురుకుగా ఉండటం, సమతుల్య, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటివి ఆరోగ్యకరమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నా ప్రధాన సిఫార్సులలో ఒకటి మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఒక గుప్పెడు బాదంను చేర్చడం, చిరుతిండిగా లేదా భోజనంలో చేర్చడం సరైన విధానం. వాటిలో విటమిన్ E, ప్రోటీన్, జింక్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించే పోషకాలు, యువిబి నష్టం నుండి రక్షించడంలో కూడా సహాయపడతాయి. ఇటువంటి చిన్న, స్థిరమైన మార్పులు శాశ్వత, ఆరోగ్యకరమైన మెరుపుకు దోహదం చేస్తాయి" అని అన్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి సోహాఅలీ ఖాన్ మాట్లాడుతూ, "ఒక నటిగా, ఆరోగ్యకరమైన రీతిలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మేము తరచుగా, ఎక్కువసేపు భారీ మేకప్ వేసుకోవలసి ఉంటుంది, దీనివల్ల చర్మం ఒత్తిడికి గురవుతుంది, చికాకు కలిగిస్తుంది. దీన్ని అధిగమించడానికి, నేను పూర్తిగా అంకితమైన చర్మ సంరక్షణ దినచర్యను అనుసరిస్తాను. చర్మానికి అనుకూలమైన ఆహారాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటాను. అలా నాకు ఇష్టమైన ఎంపికలలో ఒకటి బాదం. నేను ఎల్లప్పుడూ కాలిఫోర్నియా బాదం యొక్క చిన్న పెట్టెను నాతో తీసుకెళ్తాను. అవి నాకు ఎక్కువసేపు కడుపు నిండినట్లు చేస్తాయి. నా చర్మం, ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేసే ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం నివారించడంలో నాకు సహాయపడతాయి. బాదంలో పోషకాలు మాత్రమే కాకుండా విటమిన్ E కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది" అని అన్నారు.
మాక్స్ హెల్త్‌కేర్ - న్యూఢిల్లీలో డైటెటిక్స్ ప్రాంతీయ అధిపతి రితికా సమద్దర్ మాట్లాడుతూ, "చర్మం బాగుండాలంటే ఆరోగ్యవంతమైనది తినడం అవసరమని చాలామందికి తెలిసినప్పటికీ, వారి ఆహారంలో ఏమి చేర్చుకోవాలో వారికి తెలియదు. నా క్లయింట్లలో చాలామంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సంక్లిష్టమైన డైట్ లేదా సప్లిమెంట్ల గురించి అడుగుతారు, కానీ అది నిజంగా అంత క్లిష్టంగా ఉండనవసరం లేదు. రోజుకు ఒక గుప్పెడు బాదం, పుష్కలంగా ఆకుకూరలు, కాలానుగుణ పండ్లు, సమతుల్య ఆహారం చాలు. అసలైన తేడాను ఇవి కలిగిస్తాయి. ఈ పోషకాలు అధికంగా ఉండే గింజలు విటమిన్ E మరియు చర్మాన్ని పోషించడంలో సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. జంక్ ఫుడ్ కోరికలను అరికట్టడానికి ఇవి గొప్ప చిరుతిండిగా కూడా నిలుస్తాయి. చర్మ ఆరోగ్యం, మొత్తం శ్రేయస్సు రెండింటికీ మద్దతు ఇస్తాయి" అని అన్నారు.
ఆయుర్వేద నిపుణులు మధుమిత కృష్ణన్ మాట్లాడుతూ, "త్వరిత పరిష్కార చర్మ చికిత్సల ప్రపంచంలో, ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సహజమైన, కాల పరీక్షలకు తట్టుకుని నిలబడిన పరిష్కారాలకు తిరిగి రావాలని గుర్తు చేస్తుంది. ఆయుర్వేదం ఎల్లప్పుడూ అంతర్గత ఆరోగ్యం, బాహ్య సౌందర్యం మధ్య లోతైన సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుంది. మీరు ఏమి తింటారో అది నిజంగా మీ చర్మంపై ప్రతిబింబిస్తుంది. పండ్లు, కూరగాయలు, బాదం వంటి గింజలు అధికంగా ఉండే ఆహారం మొత్తం చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వాస్తవానికి, ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని గ్రంథాలు బాదం చర్మ కాంతిని పెంచడంలో, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో బాదం పాత్రను చాలా కాలంగా ప్రశంసిస్తున్నాయి " అని అన్నారు.
ఫిట్‌నెస్ మాస్టర్, పిలేట్స్ బోధకులు యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన చర్మం రెండు ముఖ్యమైన అంశాలను మననం చేస్తుంది. అవి సరైన ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటం. బాదం, కాలానుగుణ పండ్లు, కూరగాయలు మరియు చిరు ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తమ డైట్లో చేర్చాలని నేను సిఫార్సు చేస్తున్నాను, ఎందుకంటే అవి మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండటానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది చర్మ కణాలను పోషించడంలో సహాయపడుతుంది. సహజమైన మెరుపును జోడిస్తుంది. అయితే, నా క్లయింట్‌లతో సహా చాలామంది వ్యక్తులు వ్యాయామం తర్వాత చెమట పేరుకుపోవడం వల్ల బ్రేక్‌అవుట్‌లను అనుభవిస్తారు. అందుకే వ్యాయామం తర్వాత సరళమైన చర్మ సంరక్షణ, ఆహార దినచర్య కూడా అంతే ముఖ్యమైనది” అని అన్నారు.
ప్రముఖ దక్షిణ భారత నటి శ్రియా శరన్ మాట్లాడుతూ "ఒక నటిగా, నాకు చర్మ సంరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగినది. బిజీగా షూట్ చేయడం, భారీ మేకప్ వేసుకోవడం, నిరంతర ప్రయాణాలు తరచుగా నా చర్మాన్ని ఒత్తిడికి గురి చేస్తాయి, దీనివలన చర్మం పొడిబారడం, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు వస్తాయి. దీన్ని నిర్వహించడానికి, సీజనల్ పండ్లు, కూరగాయలు, బాదంతో కూడిన సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ద్వారా నా చర్మాన్ని లోపలి నుండి పోషించడంపై దృష్టి పెడతాను. బాదం నాకు ఇష్టమైన చిరుతిండి - అవి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లతో నిండి ఉంటాయి, ఇవి నన్ను పూర్తిగా శక్తివంతంగా ఉంచడానికి, నా మొత్తం చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. ఉదయం, రాత్రి స్థిరమైన చర్మ సంరక్షణ దినచర్య, నా చర్మాన్ని సమతుల్యంగా ఉంచుతుంది" అని అన్నారు.
ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం వేళ, కాలిఫోర్నియా బాదం వంటి చర్మ-స్నేహపూర్వక ఆహారాలను మన రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కోసం చర్మ పోషణ అవసరాన్ని గుర్తిద్దాం.