విమానంలో ప్రయాణించడమంటే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలకే సాధ్యమవుతుంది. ఎందుకంటే టిక్కెట్ ధర ఆ స్థాయిలో వుంటుంది కనుక. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు పొరబాటున కూడా విమానంలో ప్రయాణించాలని అనుకోరు. అసలు అలాంటి ఆశలే పెట్టుకేరు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఇతిహాద్ ఎయిర్ లైన్స్ మాత్రం దిగువ మధ్యతరగతి ప్రజలకోసం ఓ అవకాశాన్ని కల్పించింది.
వారు కూడా విమానయానం చేసేందుకు అనువైన మార్గాన్ని సూచించింది. విమానంలో ప్రయాణించేందుకు గాను ఫ్లై నౌ అండ్ పే లేటర్ అనే నినాదంతో EMI... ఇఎమ్ఐ, ప్రతి నెలా వాయిదాల రూపంలో డబ్బు చెల్లించుకునే అవకాశాన్ని కల్పించింది. దీని ప్రకారం ప్రయాణికులు తాము టిక్కెట్ కొనుగోలు చేసేటపుడు EMI ఆఫ్షన్ సెలక్ట్ చేసుకుని ఎన్ని నెలల్లో టిక్కెట్ డబ్బును కట్టగలరో చూపిస్తే సరిపోతుంది. అలా తాము అనుకున్నట్లు విమానయానం చేసేయవచ్చు.