గుడ్ న్యూస్... గ్యాస్ సిలిండర్ పైన రూ. 100 తగ్గింపు

సోమవారం, 1 జులై 2019 (10:00 IST)
వంట గ్యాస్ ఉపయోగించేవారికి గుడ్ న్యూస్. సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కో సిలిండర్‌పై రూ. 100 తగ్గిస్తూ జూన్ 30వ తేదీ ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ - రూపాయి మారకం విలువ తగ్గడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐవోసీ తెలిపింది.
 
కాగా రూ. 100 తగ్గక ముందు సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 737.50గా వుండగా ఇపుడా ధర రూ. 637గా వుండనుంది. సబ్సిడీ కోటా కలిగిన వాళ్లకు ఒక్కో సిలిండర్ రూ. 494.35 చెల్లించాల్సి వుంటుంది. మిగిలిన మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు