ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అత్యంత వినూత్నమైన టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి ఐసీఐసీఐ ఫ్రు ఐ ప్రొటెక్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంను ఆవిష్కరించింది. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో భాగంగా జీవించి ఉన్ననాటికి చెల్లించిన ప్రీమియంలపై 105% రిటర్న్స్ చెల్లించడంతో పాటుగా 64 తీవ్ర అనారోగ్యాలకు కవరేజీ కూడా అందిస్తుంది. పరిశ్రమలో ఇది అత్యధికం. ఇది రెండు వేరియంట్లు లైఫ్ స్టేజ్ కవర్ మరియు లెవల్ కవర్ అందిస్తుంది.
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా మాట్లాడుతూ, మా వినూత్నమైన ప్రొటెక్షన్ ఉత్పత్తి ఐసీఐసీఐ ప్రు ఐ ప్రొటెక్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం, జీవితంలో అన్ని దశలకూ అవసరమైన రక్షణను స్థిరమైన ప్రీమియంలతో పాటుగా అన్ని ప్రీమియంలపై 105% రిటర్న్స్‌తో అందిస్తుంది. సర్వైవల్ ప్రయోజనాలపై వినియోగదారులకు ఉన్న సందేహాలకు తగిన సమాధానం ఈ ఉత్పత్తులు అందిస్తాయని మేము నమ్ముతున్నాము. దేశంలో అధికశాతం మందికి ఆర్ధిక భద్రతను అందించాలనే ప్రయత్నంలో మేము విప్లవాత్మక సాంకేతిక పరిష్కారాలపై ఆధారపడటం కొనసాగించనున్నాము అని అన్నారు.