ఇదిలావుంటే, ఈమధ్యకాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు వరసగా పెరిగిపోతుండడంతో వాహనదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. వరసగా రెండో రోజు ప్రభుత్వ చమురు సంస్థలు ధరలను పెంచలేదు.
ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90.93, డీజిల్ ధర 81.32గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోలు లీటరుకు రూ.94.54గా ఉండగా, డీజిల్ ధర రూ.88.69గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.91.12గా ఉండగా, డీజిల్ ధర రూ.84.20గా కొనసాగుతోంది.
ముంబైలో లీటరు పెట్రోలు ధర 97.34గా ఉండగా, డీజిల్ ధర రూ.88.44గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 92.90గా ఉండగా, డీజిల్ ధర రూ.86.31గా కొనసాగుతోంది.