ప్రతి నెల డబ్బులు వస్తాయి కాబట్టి ఆర్థికంగా ఇది ఉపయోగపడుతుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం కోరుతుంది. ఇప్పటికే ఈ పథకంలో 21,23,809 మంది రైతులు చేరారు. రైతుల వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. రైతులు 2 హెక్టార్లలోపు భూమిలో వ్యవసాయం చేస్తుండాలి. చిన్న, మధ్య తరహా రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
అర్హులైన రైతులు ఈజీగా ఈ పథకంలో చేరవచ్చు. ముందుగా ఈ వెబ్ సైట్ (https://pmkmy.gov.in)లోకి వెళ్లండి. అక్కడ కుడివైపున ఓ మూల క్లిక్ హియర్ టు అప్లై నౌ (Click here to apply now) అనే బాక్సు క్లిక్ చెయ్యాలి. ఓ కొత్త పేజీ తెరచుకుంటుంది. అక్కడ సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ (Self Enrollment) అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చెయ్యాలి.
మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత పేరు, ఇతరత్రా మరికొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు 60 ఏళ్లు దాటాక నిశ్చింతగా ఉండేందుకు కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీన్ని అర్హులైన రైతులంతా ఉపయోగించుకోవాలని కోరుతోంది.