ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధనలో భాగంగానే రాబోయే 3 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది ఇంజనీర్లను నియమించుకుంటామని, ఇతర పాత్రలలో మరో 1,000 మందిని ఎంపిక చేయనున్నామని ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు.
గ్లోబల్ మార్కెట్, అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంస్థ రంగం సిద్ధం చేస్తోందని భవీష్ అగర్వాల్ వెల్లడించారు. ఇందు కోసం త్వరలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామన్నారు. ఓలా ఎలక్ట్రిక్‌ను గ్లోబల్ ఇంజనీరింగ్ సంస్థగా మార్చే లక్ష్యంతో సంస్థాగత పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అగర్వాల్ పేర్కొన్నారు.