ఈ సందర్భంగా మదురైకి చెందిన వ్యాపారి మూర్తి మాట్లాడుతూ గతంలో వినియోగదారులు ఐదు కిలోల ఉల్లిని తీసుకువెళ్లేవారని, ఇప్పుడు ఒక కిలో లేదా అర కిలో ఉల్లిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై పలువురు గృహిణులు మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి సరిపడా ఉల్లిని కొనుగోలు చేసేందుకు రూ.350 నుంచి రూ.400 వరకూ ఖర్చుచేయాల్సివస్తున్నదని అన్నారు.
ఉల్లి ధరల పెరుగుదలకు కేంద్రం పలు రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా, ఉల్లి ధరల నియంత్రణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోనుంది. ఇప్పటికే రెండు దేశాల నుంచి కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంది.