45 మిలియన్ డాలర్ల డీల్‌ను ముగించిన పర్పుల్ డాట్ కామ్
శుక్రవారం, 26 మార్చి 2021 (21:59 IST)
భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ బ్యూటీ కేంద్రాలలో ఒకటైన పర్పుల్ డాట్ కామ్ ఇప్పుడు 45 మిలియన్ డాలర్ల డీల్‌ను వెర్లిన్‌వెస్ట్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, బ్లూమ్ వెంచర్స్, జెఎస్‌డబ్ల్యు వెంచర్స్‌తో పూర్తి చేసింది. ముగ్గురు ప్రస్తుత మదుపరులు సంస్థపై తమ నమ్మకాన్ని పునరుద్ఘాటించగా, సీక్వోయా క్యాపిటల్ ఇండియాను నూతనంగా పర్పుల్ స్వాగతించింది. రాబోయే 4-5 సంవత్సరాలలో 8-10 రెట్లు వృద్ధిని నమోదుచేయాలనే బ్రాండ్ లక్ష్యం చేరుకునేందుకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నాయి.
ఈ డీల్ గురించి మనీష్ తనేజా, కో-ఫౌండర్ అండ్ సీఈవో పర్పుల్ డాట్ కామ్ మాట్లాడుతూ, సీక్వోయా క్యాపిటల్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. దీనిద్వారా వారు ఆన్‌లైన్ బ్యూటీ పరిశ్రమలో ప్రవేశించారు. వెర్లిన్‌వెస్ట్, జెఎస్‌డబ్ల్యు వెంచర్స్, బ్లూమ్ వెంచర్స్‌లు మరలా పెట్టుబడులు పెట్టడమనేది మా మదుపరుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. పర్పుల్‌కు అసాధారణ వృద్ధి సూచికలు కనిపిస్తున్నాయి. కోవిడ్ సంవత్సరంలో కూడా, మేము గత మూడేళ్ల కోసం సాధించిన జీఎంవీ సీఏజీఆర్‌లో 90% సాధించాం. మా ప్రైవేట్ బ్రాండ్లను విజయవంతంగా విస్తరిస్తుండటంతో; ఇప్పటికే మేము 150 కోట్ల రూపాయల బ్రాండ్‌గా మారాము. ఈ పెట్టుబడులు పర్పుల్‌ను మిలియన్ డాలర్, డిజిటల్ ఫస్ట్, బ్యూటీ మరియు వ్యక్తిగత సంరక్షణ సంస్థగా మార్చనున్నాయిఅని అన్నారు.
సీక్వోయా క్యాపిటల్ ఇండియా వినూత్నమైన స్టార్టప్స్‌లో ముందుగానే పెట్టుబడులు పెట్టడం ద్వారా విజయవంతంగా మార్కెట్ అవసరాలను తీరుస్తుంది. ఇప్పటికే భారతదేశంలో యునికార్న్స్ అయినటువంటి బైజూస్, ఓయో, జొమాటో, ఫ్రెష్ వర్క్స్‌లో పెట్టుబడులు పెట్టింది.
భారతదేశంలో ఈ-కామర్స్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుండటంతో పాటుగా అసాధారణ వృద్ధినీ నమోదు చేస్తుంది. పంపిణీ వేదికలు మరియు తమకు సంబంధితమైన అంశాల నడుమ స్పష్టమైన వైవిధ్యతను వినియోగదారులు చేస్తున్నారు. పర్పుల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వారు వాల్యూ రిటైలింగ్‌కు సంబంధించి బ్యూటీ ప్లేబుక్‌ను మూడు కీలకమైన అంశాలు, అత్యధిక స్ధాయిలో నిలుపుకోవడం మరియు అతి తక్కువ ఖర్చుతో వినియోగదారులను సొంతం చేసుకోవడం (సీఏసీ), విస్తృతశ్రేణిలో బ్రాండ్లు అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడం మరియు ఆకర్షణీయమైన ప్రైవేట్ లేబుల్ పోర్ట్‌ఫోలియో మిక్స్‌తో బ్యూటీ ప్లేబుక్‌ను ఒడిసిపట్టగలదనే నమ్మకంతో ఉన్నాం. పూర్తి ఆధిపత్యం చూపే బ్యూటీ కేంద్రంగా పర్పుల్ మారుతుంది మరియు ఈ ఆన్‌లైన్ బ్యూటీ పరిశ్రమ వృద్ధి 10% నుంచి 25%కు రాబోయే దశాబ్ద కాలంలో వృద్ధి చెందగలదు అని సాక్షి చోప్రా, ప్రిన్సిపాల్, సీక్వోయా ఇండియా అన్నారు.
పర్పుల్ కోసం, ఈ సంవత్సరం అసాధారణ వృద్ధిని తీసుకువచ్చింది. ప్రతి ఇంటికి సౌకర్యవంతంగా బ్యూటీ చేరుకోవాలన్న నిబద్ధతతో ఇది కృషి చేస్తుంది. సారా అలీఖాన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా పర్పుల్ నియమించుకుంది. దీనితో పాటుగా గో పర్పుల్ అంటూ ప్రత్యేక ప్రచారం ప్రారంభించింది. మొత్తంమ్మీద విక్రయాలు, లావాదేవీల విలువలో వృద్ధి కనిపిస్తుండటం చేత గత సంవత్సరంతో పోలిస్తే వినియోగదారుల సంఖ్యలో కూడా వృద్ధి కనిపించింది.
పర్పుల్ యొక్క విస్తరించిన సిరీస్ సీ రౌండ్ తరువాత పెట్టుబడులు గురించి అర్జున్ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-వెర్లిన్‌వెస్ట్ మాట్లాడుతూ, కోవిడ్ ఉన్నప్పటికీ, పర్పుల్ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అందుబాటు ధరలలో, ఆకర్షణీయమైన ఉత్పత్తులను అందించడం ద్వారా అందాన్ని ప్రజాస్వామ్యీకరించాలనే వారి లక్ష్యం పట్ల మేము విశ్వసిస్తున్నాము. ఈ సంవత్సరం మా పెట్టుబడులతో పర్పుల్ మరింతగా తమ స్ధానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటుగా బ్యూటీ ఈ-కామర్స్ విభాగంలో మార్కెట్ అగ్రగామిగా నిలువనుంది అని అన్నారు.
పర్పుల్ యొక్క విస్తరణలో సిరీస్ ఏ ఇన్వెస్టర్‌గా ఐవీక్యాప్ వెంచర్స్ అత్యంత కీలకంగా మారనుంది. ఐవీ క్యాప్ వెంచర్స్‌కు 22 రెట్ల వృద్ధిని అందించడం గురించి విక్రమ్ గుప్తా, ఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్టనర్, ఐవీ క్యాప్ వెంచర్స్ మాట్లాడుతూ మా ఫండ్ 1 మరియు ఫండ్ 2 నుంచి పర్పుల్ డాట్ కామ్‌లో మేము పెట్టుబడులు పెట్టాము. మేము తొలుత పర్పుల్‌లో 2015లో పెట్టుబడులు పెట్టాము. డిజిటల్, ఖచ్చితంగా వైవిధ్యతను తీసుకురానుందని మేము నమ్ముతున్నాము.
భారతదేశంలో బ్యూటీ పరిశ్రమను ఇది పునర్నిర్వచించనుంది. మా ఫండ్ 1 నుంచి 15 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడితే అది ఎన్నో రెట్లు వృద్ధి చెంది 330 కోట్ల రూపాయలుగా మారింది. ఈ భాగస్వామ్యం మాకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. ఈ కంపెనీ వృద్ధి పట్ల మాకు నమ్మకం ఉంది. ఈ కారణం చేతనే ఫండ్ 2 కోసం మా వాటాలను అలాగే ఉంచాం. ఈ బ్రాండ్ పట్ల మా నమ్మకం మరియు దీని వ్యవస్థాపకుల అందరికీ అందం అనే నమ్మకం, పర్పుల్ నుంచి మా మొత్తం ఫండ్1పై 1.35 రెట్లు వృద్ధి సృష్టించడానికి తోడ్పడింది అని అన్నారు.