పెద్ద నోట్ల రద్దుపై భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. నోట్ల రద్దు తెలివి తక్కువ నిర్ణయంగా అభివర్ణించారు. పైగా, ఈ నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ఉద్దేశం మంచిదే అయినా.. అది విఫల ప్రయోగంలా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, దేశంలో ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో చాలానష్టాలు జరిగాయన్నారు. జీడీపీ వృద్ధి రేటు భారీగా తగ్గింది. ఒకటి రెండు శాతం తగ్గడం అంటే కనీసం రూ.2.5 లక్షల కోట్ల విలువతో సమానమన్నారు. ప్రజలను రోజుల తరబడి క్యూలైన్లలో నిలబెట్టారు. కొత్త కరెన్సీ ముద్రణకు భారీగా ఖర్చయింది. అటు బ్యాంకులకు కూడా ఈ డబ్బు మొత్తాన్ని సేకరించడం భారమైందన్నారు.
తాను ఆర్బీఐ గవర్నర్‌పై ఉన్న సమయంలో నోట్ల రద్దు ఎప్పుడు చేయబోతున్నారన్నదానిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రాజన్ వెల్లడించారు. నోట్ల రద్దు వల్ల జరిగే లబ్ధి, అయ్యే ఖర్చులపై జరిగిన చర్చల్లో నేను ఉన్నాను. అయితే ఎప్పుడన్నదానిపై ఏమీ చెప్పలేదు.