ఏటీఎంలో డబ్బులు లేవా... బ్యాంకులకు బాదుడే : ఆర్బీఐ

బుధవారం, 11 ఆగస్టు 2021 (10:03 IST)
బ్యాంకులకు భారత రిజర్వు బ్యాంకు ఝులక్ ఇచ్చింది. ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు జరిమానా తప్పదని హెచ్చరించింది. ఇక నుంచి ఏటీఎంల్లో ప‌ది గంట‌ల‌కు పైగా న‌గ‌దు లేక‌పోతే సంబంధిత బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆప‌రేట‌ర్ల‌పై రూ. 10 వేల వ‌ర‌కు పెనాల్టీ విధిస్తామ‌ని ప్ర‌తిపాదించింది. ఈ మేర‌కు నూత‌న నిబంధ‌న‌లు వ‌చ్చే అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి.
 
సాధారణంగా బ్యాంకు ఏటీఎంలో న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ కోసం వెళితే.. సారీ.. అవుటాఫ్ క్యాష్‌.. మీకు క‌లిగిన అంత‌రాయానికి మ‌న్నించండి. మ‌రో ఏటీఎంను సంప్ర‌దించండి.. అనే మెసేజ్‌ను స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఏటీఎంల్లో న‌గ‌దు లేక‌పోతే ప్ర‌జ‌లు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. న‌గ‌దు లేమితో ఏటీఎం మిష‌న్లు గంట‌ల త‌ర‌బ‌డి ఖాళీగా ఉంటున్నా బ్యాంకులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం ఆర్బీఐ దృష్టికి వెళ్లింది. అందుకే బ్యాంక‌ర్లు, ఏటీఎం ఆప‌రేట‌ర్ల‌పై క‌న్నెర్ర చేసింది.
 
ఇక నుంచి ఏటీఎంల్లో 10 గంట‌ల‌కు పైగా న‌గ‌దు లేక‌పోతే సంబంధిత బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆప‌రేట‌ర్ల‌పై రూ.10 వేల వ‌ర‌కు పెనాల్టీ విధిస్తామ‌ని ప్ర‌తిపాదించింది. ఈ మేర‌కు నూత‌న నిబంధ‌న‌లు వ‌చ్చే అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి రానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు