జనవరి ఒకటి నుంచి పలు రైళ్ళ ప్రయాణ వేళల్లో మార్పులు...

ఠాగూర్

మంగళవారం, 31 డిశెంబరు 2024 (19:27 IST)
దేశ వ్యాప్తంగా పలు రైళ్ళ ప్రయాణ వేళల్లో మార్పులు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైలు సర్వీసు ప్రయాణ వేళల్లో కూడా ఈ మార్పులు జరిగాయి. ఈ మేరకు దక్షిమ మధ్య రైల్వే మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మార్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. 
 
జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం, కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్)లో మారిన ప్రయాణ వేళలు చూసుకోవచ్చని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు