భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. పాసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో తన నిశ్చితార్థాన్ని ప్రకటించింది. ఈ జంట ఇటీవల ఉంగరాలు మార్చుకున్నారు. సింధు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్మెంట్ ఫోటోను పంచుకున్నారు.
ఎంగేజ్‌మెంట్ ఫోటోతో పాటు, "మనం ప్రేమను స్వీకరించినప్పుడు, దానికి బదులుగా మనం కూడా ప్రేమను అందించాలి" అనే సందేశంతో సింధు పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
షేర్ చేసిన చిత్రంలో జంట కలిసి కేక్ కట్ చేశారు. డిసెంబర్ 22న రాజస్థాన్‌లో వివాహం జరగనుంది. సింధు పెళ్లి రోజు దగ్గరపడుతుండటంతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాయి.