ఆగస్టు 9-14 వరకూ నిర్వహించే ఈ సేల్‌లో భాగంగా జయభూమి, కెప్టెన్ హార్వెస్ట్, అన్నభూమి వంటి బ్రాండ్లు పై ప్రత్యేకంగా ఈ వేదిక వద్ద భారీ రాయితీలు లభించనున్నాయి. ఉడాన్ యొక్క ఆహార వ్యాపారంలో ఎఫ్‌ఎంసీజీ, స్టాపల్స్, ఫ్రెష్ ప్రొడక్ట్స్ కూడా భాగంగా ఉండటంతో పాటుగా కిరాణా, బేవరేజస్, చిరుధాన్యాలు, వంటనూనెలు, వ్యక్తిగత సంరక్షణ, తాజా మరియు డెయిరీ ఉత్పత్తులపై ఈ ఆఫర్లు లభించనున్నాయి.
ఈ మెగా భారత్ సేల్‌లో భాగంగా భారీ రాయితీలు, ఫ్లాష్ సేల్స్ మరియు ఖచ్చితమైన ఇన్‌స్టెంట్ క్యాష్ డిస్కౌంట్స్, ఒకటి కొంటె ఒకటి ఉచితం వంటి ఆఫర్లను ఆహారం, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై అందిస్తుంది. ఈ జాతీయ స్థాయి మెగా సేల్ ద్వారా 5 లక్షల మందికి పైగా చిన్న వ్యాపారులు మరీ ముఖ్యంగా టియర్ 2, 3 నగరాలు/పట్టణాలలోని వారికి ప్రయోజనం చేకూరనుంది.
ఉడాన్- ఫుడ్ అండ్ బిజినెస్, హెడ్ వివేక్ గుప్తా మాట్లాడుతూ, దేశంలోని కిరాణా మరియు చిరు రిటైలర్ల ప్రయోజనం కోసం ఉడాన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించబోతున్న మెగా భారత్ సేల్ ప్రకటిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ వినూత్న, అనుకూలీకరణ కార్యక్రమం మా రిటైలర్లు, తయారీ భాగస్వాములు, హోల్‌సేల్ భాగస్వాములకు మద్దతునందించనుంది. దీనిద్వారా వారు అధికంగా పొదుపు చేయడంతో పాటుగా వారి వినియోగదారులకు మరింత విలువనూ అందించగలరు అని అన్నారు.