లారీ యజమానులు, లారీ డ్రైవర్ల యోగక్షేమాల కోసం వీల్స్ఐ(Wheelseye) సహాయ పోర్టల్

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (17:33 IST)
కోవిడ్ -19 వ్యాప్తితో దేశ వ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో, లారీడ్రైవర్ల సాధికారిక లక్ష్యంతో స్టార్టప్ వీల్స్ ఐ "ట్రక్ మాలిక్ సహయతా కేంద్రా" Truck Maalik Sahayata Kendra అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, బెంగాలీ,హిందీ, ఇంగ్లీష్, పంజాబీ భాషలలో ఉచితంగా పోర్టల్ అందుబాటులో ఉంది. ఇంకా మరిన్ని భాషలు జోడించబడుతున్నాయి. 
 
ఈ పోర్టల్ లాక్‌డౌన్ కారణంగా హైవేలపై చిక్కుకున్న ట్రక్ యజమానులు మరియు డ్రైవర్లు సమీప ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 2000 కేంద్రాలలో ఆహార మరియు వసతి  సమకూరుస్తున్న సేవా కేంద్రాలను గుర్తించేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఈ పోర్టల్స్ ద్వారా సమీప మెయింటెనెన్స్ వర్క్‌షాప్‌లు, మరమ్మతు కేంద్రాల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
 
భారతదేశం యొక్క లాజిస్టిక్స్ రంగం 8 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నెముకగా పరిగణించబడుతుంది. కరోనావైరస్ వ్యాప్తి తప్పనిసరి లాక్‌డౌన్ నేపథ్యంలో, ఆర్ధిక విధులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయబడ్డాయి. ఈ అంతరాయం వెలుగులో, లాజిస్టిక్స్ రంగం యొక్క అతిపెద్ద వాటాదారులలో ఒకరైన వీల్స్ ఐ, పరిశ్రమ యొక్క శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంది మరియు ఆర్ధిక వ్యవస్థను, లారీ యజమానులను సాధికారత ద్వారా శక్తివంతం చేస్తుంది.
"మేము ఇప్పటికే మా వద్ద ఉన్న వనరులు, మేధస్సు ఉపయోగించుకుని వాటిని ట్రక్కర్లకు మరియు సాధారణంగా పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ఒక వేదికను సిద్ధం చేస్తున్నాం. మేము వేలాది మంది ట్రక్కర్లతో మాట్లాడినప్పుడు లాక్ డౌన్ కారణంగా వారి వ్యాపారాలు కుదేలైనట్లు తెలిపారు. రవాణా పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాల గురించి విస్తృతంగా అవగాహన లేద”ని వీల్స్ ఐ వ్యవస్థాపక సభ్యుడు, ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న సోనేష్ జైన్ తెలిపారు.
 
లారీ యజమానులు, డ్రైవర్లు వారానికి 7 రోజులు హెల్ప్‌లైన్‌ నెంబర్ 91 9990033455 ద్వారా వారి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. పోర్టల్ ప్రారంభించిన 20 రోజుల్లో ఇప్పటికే 2 లక్షల వీక్షణలను సంపాదించి వారికి  ప్రయోజనం చేకూర్చింది. సహాయ పోర్టల్‌ను యాక్సెస్ చేసిన 90% మంది వినియోగదారులు వారి సమస్యలు పరిష్కారం అవ్వడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పోర్టల్‌లో ఉంచబడుతున్న ప్రస్తుత వార్తలు, విషయాల గురించి ఇప్పటివరకు 95% మంది పాఠకులచే రేట్ చేయబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు