ఇంటర్‌లో రెండుసార్లు పరీక్షలు.. ఎందుకంటే?

గురువారం, 24 ఆగస్టు 2023 (14:37 IST)
ఇంటర్‌లో ప్రతి సంవత్సరం రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా రంగం సిద్ధం అవుతోంది. భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌సీఎఫ్) ప్రతిపాదించింది. అలాగే తొమ్మిదో తరగతి నుంచి 12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని తెలిపింది. 
 
ఆగస్టు 23న జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు. ప్రతి ఏడాది రెండు సార్లు పరీక్షలు నిర్వహిండం ద్వారా ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం వుంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్ లేదా టర్మ్ బేస్డ్ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యా శాఖ స్పష్టం చేసింది. 9.10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవడం తప్పనిసరి అంటూ ఎన్సీఎఫ్ సిఫార్సు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు