విద్యార్థుల పేరెంట్స్ వార్షిక ఆదాయం రూ. 3,60,000 లోపు ఉండాలి. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున మూడేళ్లు ఆర్థిక సహాయం అందిస్తారు.
విద్యార్థులు కచ్చితంగా ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ప్రస్తుతం ప్రవేశం పొందిన కాలేజ్ ఐడి లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.