ఢిల్లీలో దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన అత్తామామలు సన్నిహితంగా ఉన్న సమయంలో వారి నగ్న వీడియోను ఆ ఇంటి కోడలు తీసారు. ఇందుకు ఆమె ప్రియుడు కూడా తన వంతు సహకారం అందించారు. తాజగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి (ఆభరణాల వ్యాపారి), తన భార్యకు నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు.
బండారం బయటపడటంతో ఇంట్లో ఉన్న రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకొని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తకు ఫోన్ చేసిన భార్య.. బెదిరింపులకు దిగింది.