* నేర్చుకున్న అంశాన్ని వెంటనే మరచిపోవటం, మళ్లీ మళ్లీ దాన్ని అడగటం.. సాధారణ పిల్లల్లాగే కనిపించినా, సొంతంగా ఎలాంటి పనులూ చేయలేకపోవటం.. రోజూ ఒకేరకమైన అంశాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించటం.. చిన్న శబ్దాలను సైతం తట్టుకోలేక పోవటం.. బంధువుల్ని సైతం గుర్తించలేకపోవటం.. ఒకసారి చూసిన వ్యక్తిని రెండోసారి చూస్తే పోల్చుకోలేక పోవటం... లాంటివి మీ చిన్నారుల్లో కనిపించినట్లయితే వారు "ఆటిజం" అనే వ్యాధితో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి.
* సాధారణ చిన్నారులతో పోల్చితే ఆటిజంతో బాధపడే పిల్లలపై ఎక్కువ ఆత్మీయతను తల్లిదండ్రులు కనబర్చాలి. చిన్న చిన్న పనుల్ని వారే చేసుకునేలా శిక్షణనివ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వైద్యుల సలహాలను తీసుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా వీలున్నప్పుడల్లా కొత్త ప్రాంతాలను ఆటిజంతో బాధపడే పిల్లలకు పరిచయం చేయాలి.
* సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఆటిజం చిన్నారుల్లో మంచి మార్పును తీసుకొస్తుంది. కాబట్టి.. అలాంటి చిన్నారులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని గుర్తుంచుకోవాలి.