ఇడ్లీ పిండిలో అరటి ఆకును వుంచితే..?

గురువారం, 6 డిశెంబరు 2018 (14:23 IST)
ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు బియ్యంలో ఒక స్పూన్ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసాన్ని చేర్చితో అన్నం విడివిడిగా వుంటాయి. వేయించిన వేరుశెనగలను పొడి చేసి తాళింపులకు అరస్పూన్ చేర్చితో రుచిగా వుంటుంది. ఇడ్లీ పిండి పులుపెక్కకుండా వుండాలంటే.. ఓ చిన్నపాటి అరటి ఆకును అందులో వేసి వుంచితే సరిపోతుంది. చికెన్‌ను ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డును చేర్చితే రుచిగా వుంటుంది. 
 
తాళింపు చేసేటప్పుడు అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ వుంటే.. కూరలు అంటుకోవు. కూరగాయలను ఉడికించేటప్పుడు పాత్రను మూసి వుంచితే పోషకాలు వేరుకావు. ఇంకా త్వరగా కూరగాయలు ఉడికిపోతాయి. దుస్తుల్లో ఏవైనా టీ, కాఫీ మరకలు పడితే వేడి నీటిలో నానబెట్టి ఉతికితే సరిపోతుంది. ఇంట్లోని ఎలక్ట్రానిక్ స్విచ్‌ల్లో మరకలుంటే నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు