తెలంగాణ కరోనా కేసుల లెక్కలన్నీ తప్పుడు లెక్కలు, ఎవరు?: మాస్కులేవీ? హైకోర్టు

మంగళవారం, 25 జనవరి 2022 (14:18 IST)
తెలంగాణ కరోనా కేసుల ఉధృతి లేనేలేదు. అస్సలు నైట్ కర్ఫ్యూ అవసరంలేదు అని ప్రభుత్వం చెపుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుందని ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు.

 
ఫీవర్ సర్వేలో ఏకంగా మూడంటే మూడు రోజుల్లో లక్షా 70 వేల మంది బాధితులను గుర్తిస్తే... రోజువారీ చెక్ చేస్తే ఇంకా ఎంతమంది వుంటారో తెలుస్తుందన్నారు. తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం సమర్పిస్తున్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలని, పైగా ప్రభుత్వ కిట్లో పిల్లలకు అవసరమైన మందులు అస్సలు కనబడటంలేదని పిటీషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ఐతే పిటిషనర్ల తరపున న్యాయవాదులు చేసిన వాదలను తోసిపుచ్చిన ప్రభుత్వం, కరోనా విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 
ఇరువురి వాదనలను విన్న హైకోర్టు... రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో పౌరులు మాస్కులు లేకుండా బయట తిరగాడన్ని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. భౌతిక దూరం కూడా పాటించకపోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోర్టు, జిహెచ్ఎంసి, పోలీసులు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు జరిగేట్లు చూడాలని ఆదేశాలు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు