దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. సెకండ్ వేవ్..?

గురువారం, 31 డిశెంబరు 2020 (11:16 IST)
కరోనా ఉధృతి మళ్లీ మొదలైంది. భారత్‌లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, సెకండ్ వేవ్ ఎఫెక్ట్, కొత్త స్ట్రెయిన్ కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. 
 
కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం ఇండియాలో కొత్తగా 21,821 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,02,66,674కి చేరింది. ఇందులో 98,60,280 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,57,656 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 299 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,48,738కి చేరింది. గడిచిన 24 గంటల్లో 26,139 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు