పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇక పిల్లలు బాగా చదువుకుంటారులే అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే కరోనా విజృంభిస్తోంది. పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఒకరిద్దరు కూడా కాదు... ఏకంగా 17మంది ఉపాధ్యాయులు, 10మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది.
పాఠశాలలు ప్రారంభమైన 16వ తేదీ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు, 17వ తేదీన ఒకరికి, 19వ తేదీన ఆరుగురికి, 21వ తేదీన ముగ్గురు ఉపాధ్యాయులకు, అలాగే ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ నిర్థారణ అయ్యింది.
23వ తేదీన ముగ్గురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థులకు, 24వ తేదీన ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.