ముందస్తు హెచ్చరిక చర్యలుగా, 30 ఏళ్లు పైబడిన వారు వారి రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను చెక్ చేసుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్, ఎకోకార్డియోగ్రామ్, 'ట్రెడ్‌మిల్' పరీక్షతో సహా కార్డియో టెస్టులు చేయించుకోవాలి.
యువకులు హెవీ వర్కౌట్లు చేయనక్కర్లేదు. ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి. శరీర బరువును నియంత్రించాలి. పొగ త్రాగరాదు. మద్యపానం తగ్గించాలి. ఒత్తిడిని తగ్గించుకోండి. రోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవాలి.
కరోనా ఇన్‌ఫెక్షన్ తర్వాత గుండెపోటు, గుండె జబ్బుల కారణంగా యువకులు చనిపోవడంపై పరిశోధనలు చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిధులు కేటాయించాలని, ప్రజల్లో భయాందోళనలను తగ్గించేందుకు కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని డాక్టర్ నరేష్ కోరారు.