తమిళనాడు కరోనా తీవ్రత.. కొత్తగా 15,759 వైరస్ కేసులు

శుక్రవారం, 11 జూన్ 2021 (23:08 IST)
తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,759 వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 378 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆ తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,24,597కు, మొత్తం మరణాల సంఖ్య 28,906కు చేరింది.

ప్రస్తుతం 1,74,802 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతుంది. 
 
మరోవైపు తమిళనాడులో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్‌డౌన్ ఆంక్షల‌ను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపుల‌కు అనుమతిస్తారు.

చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్ర‌భుత్వం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు