కరోనా వైరస్‌కు కామారెడ్డి టెక్కీ మృతి

గురువారం, 12 మార్చి 2020 (13:08 IST)
కరోనా వైరస్‌కు తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ టెక్కీ మృత్యువాతపడ్డారు. ఆయన పేరు అరుణు కుమార్. వయసు 41 యేళ్లు. భిక్కనూరు మండలానికి చెందిన బూర్ల అరుణ్ కుమార్.. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతూ, శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు.
 
అయితే, ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన అమెరికాలో మృతి చెందాడు. ఉద్యోగ రీత్యా ఆయన 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. హ్యుస్టన్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. 16 ఏళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు