ఆసక్తికరంగా రెండో టెస్ట్ : నాలుగో రోజు ఆటకు వరుణుడు అంతరాయం

గురువారం, 6 జనవరి 2022 (14:30 IST)
జోహెన్నస్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో గురువారం ఇంకా ఆట మొదలుకాలేదు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికా ముంగిట 240 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా జట్టు నిర్ధేశించిన విషయం తెల్సిందే. 
 
ఈ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే మరో 122 పరుగులు చేయాల్సివుండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. 
 
క్రీజ్‌లో కెప్టెన్ డీన్ ఎల్గార్ 46, రాస్సీ వాన్ డర్ డుస్సెన్‌లు 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు ఆరంభంలోనే కీలక వికెట్లను పడగొడితే మాత్రం మ్యాచ్‌పై పట్టుసాధించినట్టే. 
 
కాగా, ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202, దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు చేసింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు