ఆసియా క్రికెట్ సందడి మొదలైంది. తొలి మ్యాచ్‌లో క్రికెట్ పసికూన నేపాల్‌ను పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడియింది. 250కి పైచిలుకు పరుగులతో ఓడించింది. అయితే, ఈ టోర్నీలో భాగంగా, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు శుక్రవారం తలపడనున్నాయి. సెప్టెంబరు రెండో తేదీ అయిన శనివారం ఈ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లోనే కాకుండా, యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆతృతతో ఎదురు చూస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు రూపంలో ముప్పు కలిగే ప్రమాదం పొంచివుంది.
శనివారం శ్రీలంకలోని కాండీలో జరిగే మ్యాచ్ సందర్భంగా వాన కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ అంచనా. వాతావరణంలో తేమ 84 శాతంగా ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, క్రికెట్ అభిమానులు డీలా పడిపోయారు. ఉత్కంఠ పోరును మిస్ అవుతామన్న ఆందోళన వారిలో నెలకొంది.
ఇదిలావుంటే, ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు బుధవారం శ్రీలంకకు చేరుకుంది. కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా టీం సభ్యులందరూ ప్రత్యేక బస్సులో ఎయిర్ పోర్టు నుంచి హోటల్‌కు చేరుకున్నారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీన దాయాది దేశం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ ఈ టోర్నమెంట్లో రంగంలోకి దిగుతుంది.