భారతలో పని చేసేది స్పిన్ మంత్రమే కాబట్టి ఈ నెల చివరినుంచి జరిగే టెస్ట్ సీరీస్‌లో టీమ్ ఆస్ట్రేలియాకు ఘోర పరాజయం తప్పదని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. పటిష్టమైన స్పిన్ బౌలింగ్ కారణంగానే 2012 నుంచి స్వదేశంలో టీమిండియాకు ఎదురులేకుండా పోయిందని గంగూలీ చెప్పాడు. ‘మిశ్రాకు బంతిని ఇస్తే.. అతను మ్యాచ్ విన్నర్ అవుతున్నాడు. కొత్తగా చాహల్, జయంత్ యాదవ్‌లకు బంతినిస్తే వాళ్లు కూడా గెలిపించేస్తున్నారు. భారతలో పని చేస్తుంది స్పిన్ మంత్రమేన’ని దాదా అన్నాడు.