ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 సిరీస్‌లు ముగియగా, తొలి టెస్టు కూడా పూర్తయింది. ఈ టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఇంకా మరో మూడు టెస్టులు మిగిలివున్నాయి.
ఈ క్రమంలో తన భార్య గర్భంతో ఉండటంతో తనకు పెటర్నటీ సెలవు కావాలని కోహ్లీ కోరడంతో బీసీసీఐ సమ్మతం తెలిపింది. కోహ్లీ భార్య అనుష్కశర్మ ఈ వారంలో డెలివరీ కానుంది. ఈ తరుణంలో, కాన్పు సమయంలో తన భార్య పక్కనే ఉండాలనే ఉద్దేశంతో కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నాడు.