ప్రీతి జింటా కోచ్‌పై ఫైర్ అయ్యిందా..? ఇందులో ఎంతవరకు నిజముంది?

గురువారం, 12 మే 2016 (17:10 IST)
బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోచ్ సంజయ్ బంగర్‌పై సీరియస్ అయ్యింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా మొహాలీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఒక పరుగు తేడాతో పరాజయం పాలవడంపై ఫైర్ అయ్యారు. 
 
టీమ్ సభ్యుల ఎదుటే ప్రీతి జింటా కోపాన్ని ప్రదర్శించారని తెలిసింది. ఈ క్రమంలో కోచ్‌కు క్లాజ్ పీకారట. ఆ సమయంలో  సహాయక సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ బెహర్దీన్ కంటే ముందుగా అక్షర్ పటేల్‌ను ఎందుకు పంపలేదని ఆమె నిలదీసినట్లు ఆంగ్ల పత్రికలు ప్రచురిస్తున్నాయి. 
 
ఐపీఎల్ తొమ్మిదో సీజన్ పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరికంటే దిగజారడానికి కారణం బంగరేనని దుయ్యబట్టారని తెలిసింది. కానీ ప్రీతిజింటా నిలదీసిందని బంగర్ కాదు కదా.. కోచ్‌పై మండిపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి