కాశ్మీర్ 36 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఫుట్‌బాల్ మైదానంగా ఉన్న బక్షి స్టేడియం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు వేదికగా మారింది. ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్ వంటి క్రికెట్ దిగ్గజాలతో సహా దాదాపు 120 మంది ఆటగాళ్లను ఈ టోర్నమెంట్ శ్రీనగర్‌కు తీసుకువచ్చింది.
ఎల్ఎల్‌సి సహ వ్యవస్థాపకుడు, రామన్ రహేజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "యువతరానికి స్ఫూర్తినిచ్చేలా క్రికెట్, ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ లీగ్ ముఖ్య లక్ష్యమన్నారు. కాశ్మీర్ ఇంతకు ముందు రెండుసార్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.
1983, 1984లో, షేర్-ఇ-కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో, భారతదేశం, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌లు జరిగాయి. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోణార్క్ సూర్యస్ ఒడిశాను చిత్తు చేయడంతో మ్యాచ్ సదరన్ సూపర్ స్టార్స్‌కు అనుకూలంగా మారింది.