ఈ పరీక్షలో ధోనీకి కరోనా లేదని తేలింది. ఈ ఫలితంతో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలోనూ, అభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ధోనీ శుక్రవారం చెన్నై వెళ్లి సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో జట్టుతో కలవనున్నాడు.
కాగా, ఐపీఎల్ పోటీల ప్రారంభానికి ముందు ఐపీఎల్‌లో కరోనా కలకలం చెలరేగిన విషయం తెల్సిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఫీల్డింగ్ కోచ్‌కు ఈ వైరస్ సోకింది. దీంతో అతనితో కాంటాక్ట్ అయిన వారందరికీ ఈ పరీక్షలు చేస్తున్నారు.