టీమిండియా జట్టుకు ఉగ్రముప్పు.. పీసీబీకి మెయిల్.. భద్రత కట్టుదిట్టం

సోమవారం, 19 ఆగస్టు 2019 (13:05 IST)
టీమిండియా జట్టుకు ఉగ్రముప్పు పొంచివుందని హెచ్చరికలు రావడంతో ఐసీసీ అప్రమత్తమైంది. టీమిండియాకు ఉగ్ర ముప్పు పొంచి వుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అనామక మెయిల్ నుంచి సమాచారం అందింది. 
 
విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టుపై దాడులు జరపబోతున్నామని అందులో పేర్కొన్నారు. పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెంటనే ఆ మెయిల్‌ను ఐసీసీకి పంపించింది. ఇటు బీసీసీఐకి కూడా అలాంటి మెయిలే రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
బీసీసీఐ భారత హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించడంతో.. అంటిగ్వాలోని భారత హైకమిషన్‌ను అలర్ట్ చేశారు. దీంతో ఆటగాళ్లకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఆటగాళ్ల భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అంటిగ్వాలోని భారత హైకమిషన్ అధికారి తెలిపారు. 
 
అక్కడ భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్, దాని పరిసరాలపై పటిష్టమైన నిఘా ఉందన్నారు. కాగా, ఉగ్రదాడుల బెదిరింపు హెచ్చరికలతో వచ్చిన మెయిల్ బోగస్ అని అధికారులు తేల్చినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు