భారత మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ భావోద్వేగపు ట్వీట్ చేశారు. అదీ కూడా తన గారాలపట్టి సారా టెండూల్కర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సందర్భంగా ఈ ట్వీట్ చేశారు.
క్రికెట్ తర్వాత కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే సచిన్ సారా స్నాతకోత్సవ కార్యక్రమానికి సతీమణి అంజలితో కలిసి హాజరయ్యారు. ముంబై ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యనభ్యసించిన సారా లండన్ యూనివర్సిటీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. ఇక సచిన్ కుమారుడు అర్జున్ కూడా లండన్‌లోనే క్రికెట్‌లో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.