టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైకులంటే పిచ్చి. అతని వద్ద ఇప్పటికే 23 బైకులు, పదికి పైగా కార్లున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీని చూసి కివీస్ క్రికెటర్లు టామ్ లాథమ్, రాస్ టేలర్ షాక్ అయ్యారు. ఎక్కడంటే.. ధోనీ స్వస్థలమైన రాంచీలో. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ తన హమ్మర్ కారులో వెళ్తుండగా, అదే సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ బస్సులో వెళ్తోంది.
ఆ బస్సు పక్కనుంచే ధోనీ వాహనం వెళుతుండటం, లాథమ్, టేలర్లు అది గమనించడం జరిగింది. దీంతో, సంతోషంతో పాటు వారు ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ధోనీ కనిపించిన కారును రూ. 1.5లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీని విలువ రూ.43లక్షలు. కాగా.. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండు, కివీస్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించాయి.