బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతుంది. ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఇందులో తొలి టెస్టులో భారత్ గెలుపొందగా, మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
రోహిత్ మోకాలికి ఫిజియోలు పట్టీ వేశారు. దీంతో ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ నొప్పితో కుర్చీలో కూర్చొ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాయం అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఫిజియోలు అతడి పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.
కాగా, భారత జట్టు ఆటగాళ్లందరూ నెట్స్ సెషన్‌లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పేసర్లు జప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడిపారు. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ చేశారు.