జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్‌పై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐకు తెలపడంతో బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. దీనితో క్రికెట్ క్రీడాభిమానులు షాక్ తిన్నారు. కొత్త సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా ధోనీ 199 వన్డేలకు సారధ్య బాధ్యతలను వహించాడు. మరో 72 టి-ట్వంటీ మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.