రామాయణంలో సీతను రావణుడు అపహరించిన తర్వాత సంధికోసం వెళ్లిన అంగధుడు అక్కడ ఉన్న లంకేయులతో సవాల్ చేస్తాడు. తన పాదాన్నిఎవరైనా కదిపితే.. శ్రీరాముడు ఓటమిని అంగీకరించినట్లే అని అంగధుడు అంటాడు. అయితే అంగధుడి పాదాన్ని కదిపేందుకు లంకేయులు ప్రయత్నించి విఫలం అవుతారు. ఇదే విషయాన్ని తనకు ఆపాదించుకున్న సెహ్వాగ్ తన ఫుట్‌వర్క్‌ని ఏ ఒక్కరూ మార్చలేకపోయారని చెప్పకనే చెప్పేశాడు.