''నీకు ఇష్టమైన ఆట నుంచి తప్పుకో'' ధోనీకి సెహ్వాగ్ సూచన

గురువారం, 23 జనవరి 2020 (14:11 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించాడు. ధోనీ ఇక రిటైర్మెంట్ గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించాడు.

బీసీసీఐ వార్షిక ఒప్పంద జాబితాలో లేకపోవడం అంటేనే ''నీకు ఇష్టమైన ఆట నుంచి తప్పుకో'' అనే సందేశం ధోనీకి అందినట్లేనని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ కారణంగానే బీసీసీఐ ధోనీతో ఒప్పందం చేసుకోలేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 
 
పనిలో పనిగా ధోనిపై ప్రశంసలు కురిపించాడు సెహ్వాగ్. మహేంద్రసింగ్ ధోనీ ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలపై అప్పట్లో పూర్తి క్లారిటీతో ఉండేవాడని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానాల్ని మార్చడంపై సెహ్వాగ్ మండిపడ్డాడు.
 
కెప్టెన్‌ కోహ్లీకి ఇప్పటికీ టీమ్‌ బ్యాటింగ్ ఆర్డర్‌పై క్లారిటీ రావడం లేదని ఫైర్ అయ్యాడు. టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో గందరగోళం ఏర్పడటంతో పాటు ఆటగాళ్లు కూడా అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉందని సెహ్వాగ్ హెచ్చరించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు