విశాఖకు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన కెంట్ వేగంగా తీరం వైపు దూసుకొస్తుండడంతో విశాఖ వాసులు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల క్రితం సంభవించిన ‘హుద్‌హుద్’ను గుర్తుకు తెచ్చుకుని భయపడుతున్నారు. తుఫాను ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో, ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.